మనుషులతో చిరుత ఆటలు

Himachal Pradesh leopard playing with people
x
Highlights

మామూలుగా చిరుతను దగ్గరని నుంచి చూస్తే గుండే హడలిపోతుంది. కానీ అది మనుషులతో ఎంతో సరదాగా మెలుగుతుందన్న విషయం తెలిస్తే అశ్చర్యపోతారు. హిమాచల్‌...

మామూలుగా చిరుతను దగ్గరని నుంచి చూస్తే గుండే హడలిపోతుంది. కానీ అది మనుషులతో ఎంతో సరదాగా మెలుగుతుందన్న విషయం తెలిస్తే అశ్చర్యపోతారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓ చిరుత మనుషులతో ఆటలాడింది. పెంపుడు జంతువుగా రెండు కాళ్లు పైకెత్తి చిలిపిగా వ్యవహరించింది. దీంతో చుట్టు ఉన్న జనం కాస్త కంగారు పడ్డా చిరుతను అంత దగ్గర నుంచి చూసి ఎంజయ్‌ చేశారు. చివరికి ఆ చిరుత ఎవరిపైనా దాడి చేయకుండా వెళ్లిపోయింది. ఏదేమైనా తమ జీవితాల్లో ఒక సాహస సన్నివేశం జరిగిందని వారు అంటున్నారు. వన్యమృగాలకు, మనుషులకు మధ్య సామరస్యత ఉంటుందని ఈ సంఘటన రుజువు చేసిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories