Himachal: హిమాచల్‌ సీఎంగా సుఖ్వీందర్‌ ప్రమాణం.. హాజరైన ఖర్గే, రాహుల్, ప్రియాంక

Himachal: ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్

Jyothi
Published on: 11 Dec 2022 5:00 PM IST
Himachal Pradesh CM Swearing in Ceremony
X

Himachal: హిమాచల్‌ సీఎంగా సుఖ్వీందర్‌ ప్రమాణం.. హాజరైన ఖర్గే, రాహుల్, ప్రియాంక

Himachal: హిమాచల్‎ప్రదేశ్ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్‎సింగ్ సుఖు.. ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సిమ్లాలోని రిడ్జ్ మైదానంలో ప్రమాణం చేశారు. సుఖ్విందర్ సింగ్‎తో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి రాజీవ్ శుక్లా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఇంటి నుంచి బయలుదేరే క్రమంలో సుఖ్విందర్ అతని తల్లి పాదాలకు నమస్కారం చేశారు. సుఖ్విందర్ సింగ్ 1989 నుంచి 1995 మధ్య కాలంలో NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా, 2003 నుండి నాదౌన్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story