Himachal Pradesh: రాజీనామా వార్తలను ఖండించిన హిమాచల్ సీఎం సుఖ్‌‌విందర్ సింగ్

Himachal CM Sukhwinder Sukhu denies reports of resignation
x

Himachal Pradesh: రాజీనామా వార్తలను ఖండించిన హిమాచల్ సీఎం సుఖ్‌‌విందర్ సింగ్

Highlights

Himachal Pradesh: హిమాచల్‌లో బల పరీక్ష తప్పదా..?

Himachal Pradesh: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. నిన్న జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌లే దానికి నిద‌ర్శ‌నం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డ్డారు. ఈ తొమ్మిది మంది బీజేపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా ఓటు వేశారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీలో చేరుతార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గ‌డ్డుకాలం ఎదుర‌య్యే ప‌రిస్థితి ఉంది. బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకునే అవ‌కాశం ఉంది.

ఈ ప‌రిణామాల మ‌ధ్య సీఎం ప‌ద‌వికి సుఖ్‌వింద‌ర్ సింగ్ సుఖు రాజీనామా చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయలేద‌ని, బీజేపీ నేత‌లు అలా ప్ర‌చారం చేస్తున్నార‌ని సీఎం సుఖు స్ప‌ష్టం చేశారు. తాజా ప‌రిణామాల‌తో అధికార కాంగ్రెస్.. అసెంబ్లీలో త‌మ బ‌లాన్ని నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Show Full Article
Print Article
Next Story
More Stories