Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. పలు చోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

High Temperature In Telugu States
x

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

Highlights

Weather Report: ఎండలకు అల్లాడుతున్న ప్రజలు

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఫలితంగా అనేక మంది వడదెబ్బతో బారిన పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలలో ఎక్కువసేపు గడపడం వల్ల తగులుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే అధిక ఉష్ణోగ్రతల్లో పనిచేయకుండా జాగ్రత్త పడాలని. లేదంటే డీహైడ్రేషన్‌ తలెత్తి, కీలక అవయవాలు పనిచేయడం మానేస్తాయంటున్నారు. చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయే ముప్పు పెరుగుతుందన్నారు. వీలైనంత వరకూ బయట తిరగకకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. కుండలో ఉంచిన మంచినీటిని ఎక్కువ తీసుకోవాలంటున్నారు.

ఎండ వేడిమి పెరగడంతో శీతలపానియాలు, జ్యూస్‌ కేంద్రాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. అదే సమయంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లలోనూ ప్రత్యేకంగా కూలింగ్‌ వాటర్‌ క్యాన్లను అమ్ముతున్నారు.వీటిని మంచి గిరాకీ పెరిగింది. ఫ్రీజ్‌ల, ఎసిల వ్యాపారాలు జోరందుకున్నాయి. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories