కీలక నిర్ణయాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్ర మంత్రివర్గం

కీలక నిర్ణయాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్ర మంత్రివర్గం
x
Highlights

మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ ఎగుమతికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఏపీలోని కృష్ణపట్నం, కర్ణాటక...

మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ ఎగుమతికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఏపీలోని కృష్ణపట్నం, కర్ణాటక తూముకూరులో పారిశ్రామిక కారిడార్‌లతో పాటు గ్రేటర్ నోయిడాలోని మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్ అండ్ మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు పారిశ్రామిక కారిడార్లను 7వేల 725 కోట్లతో నిర్మించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వీటి నిర్మాణం ద్వారా 2లక్షల 80వేల మందికి పైగా ఉపాధి లభించనున్నట్లు అంచనా వేశారు.

కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదిత వ్యయం 2వేల 139 కోట్లుగా ఉందని జవదేకర్ తెలిపారు. ఇక్కడ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాల కల్పనతో పాటు, తయారీరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉందని చెప్పారు. పారిశ్రామిక కారిడార్ వల్ల లాజిస్టిక్ ఖర్చు తగ్గింపుతో పాటు, నిర్వహణ సామర్థ్యం మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories