జైలు నుంచి విడుదలైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్

Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌కి బెయిల్ రావడంతో జైలు నుంచి కాసేపటి క్రితమే ఆయన విడుదల అయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 28 Jun 2024 6:15 PM IST
Hemant Soren Released From Jail
X

జైలు నుంచి విడుదలైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్

Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌కి బెయిల్ రావడంతో జైలు నుంచి కాసేపటి క్రితమే ఆయన విడుదల అయ్యారు. ఈ ఏడాది జనవరి 31న భూకంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో హేమంత్ సొరెన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సుమారు 5 నెలల పాటు సొరెన్‌ జైలులో ఉన్నారు. తాజాగా జార్ఖండ్ హైకోర్టు హేమంత్ సొరెన్‌కి బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలయ్యారు.

జైలు నుంచి విడుదలైన అనంతరం కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. న్యాయ వ్యవస్థపైనా ఆయన కామెంట్ చేశారు. రోజుల తరబడి తీర్పులు వాయిదా పడుతున్నాయన్నారు హేమంత్. బెయిల్‌పై సొరెన్‌ విడుదల కావడంతో జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story