ONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్‌కు ప్రమాదం

Helicopter Mishap in Arabian Sea Near ONGC Rig in Mumbai High
x

ONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్‌కు ప్రమాదం

Highlights

ONGC Helicopter Crash: సముద్రంలో పడిపోయిన హెలికాప్టర్‌, నలుగురు మృతి.. ఐదుగురు సురక్షితం

ONGC Helicopter Crash: ONGC కి చెందిన ఓ హెలికాప్టర్‌ అరేబియా సముద్రం మీదుగా వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం 9మంది ఉండగా.. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు ONGC ఉద్యోగులు ఉన్నారు. మరో ఐదుగురిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

అరేబియా సముద్రంలోని ఓ రిగ్‌కు సమీపంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనతో రంగంలోకి దిగిన ONGC, నేవీ బృందాలు.. రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి తొమ్మిది మందిని బయటకు తీసుకువచ్చారు. ఆస్పత్రికి తరలించగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories