logo
జాతీయం

కశ్మీర్‌లో అధికంగా కురుస్తున్న మంచు

కశ్మీర్‌లో అధికంగా కురుస్తున్న మంచు
X
Highlights

* తీవ్రస్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు * అత్యల్పంగా గుల్‌మార్గ్‌లో మైనస్ 7.2 డిగ్రీలు * ఇళ్లపైనా, రోడ్లపైనా, వాహనాలపైనా మంచే * గడ్డకడుతున్న పలు సరస్సులు

కశ్మీర్‌లో చలి చంపేస్తోంది. ఆదివారం ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోయాయి. అత్యల్పంగా గుల్‌ మార్గ్‌లో మైనస్‌ 7.2 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాత్రి వేళ్లల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. శ్రీనగర్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్‌ 5.2 డిగ్రీలు, పహల్గాంలో మైనస్‌ 5.9 డిగ్రీలు, గుల్‌మార్గ్‌లో అత్యల్పంగా మైనస్‌ 7.2 డిగ్రీలు నమోదయ్యాయి.

ఇతర ప్రాంతాల కనిష్ఠ ఉష్ణోగ్రతలు చూస్తే.. కాజీగుండ్‌లో మైనస్‌ 5 డిగ్రీలు, కుప్వారాలో మైనస్‌ 4.8 డిగ్రీలు, కొకెర్‌నాగ్‌లో మైనస్‌ 4.9 డిగ్రీలుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మైనస్‌ ఉష్ణోగ్రతల ప్రభావంతో.. ప్రముఖ దాల్‌ సరస్సు సహా కశ్మీర్‌ వ్యాప్తంగా సరస్సులన్నీ గడ్డకట్టుకుపోయాయి.

ఇక.. హిమాలయ పర్వతాలకు సమీపంగా ఉన్న జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. ఇళ్లపైనా, రోడ్లపైనా మంచు పేరుకుపోయింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఓ సరస్సు గడ్డకట్టుకుపోయింది. లాహౌల్-స్పితి జిల్లా జోబ్రాంగ్‌లో ఖొలుడు స‌ర‌స్సు పూర్తిగా మంచుగడ్డలా మారిపోయింది. కొంత మంది పర్యాటకులు ఆ గడ్డకట్టిన సరస్సుపై నడుస్తూ ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు.

Web TitleHeavy snowfall in Kashmir
Next Story