Sabarimala: శబరిమల అయ్యప్ప సన్నిధికి పోటెత్తిన భక్తులు

Heavy Rush in Sabarimala 1.19 Lakh Pilgrims Booked
x

Sabarimala: శబరిమల అయ్యప్ప సన్నిధికి పోటెత్తిన భక్తులు

Highlights

Sabarimala: శబరిమల అయ్యప్ప సన్నిధికి భక్తులు పోటెత్తారు.

Sabarimala: శబరిమల అయ్యప్ప సన్నిధికి భక్తులు పోటెత్తారు. కొండలన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణలతో మార్మాగాయి. సోమవారం ఒక్క రోజే స్వామి దర్శనం కోసం లక్షా 7 వేల 260 మంది భక్తులు తమ పేర్లను బుక్ చేసుకున్నారు. భారీ సంఖ్యలో వస్తున్న భక్తుల కోసం కేరళ ప్రభుత్వం, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ అదనపు ఏర్పాట్లు చేశాయి. అసలు ఒక సీజన్ లో ఒక్క రోజులో అధిక సంఖ్యలో భక్తులు దర్శనాలకు రావడం ఇదే మొదటిసారి అని ఆలయం వర్గాలు చెబుతున్నాయి. రద్దీ నియంత్రణకు అదనపు పోలీసులు రంగంలోకి దిగారు. పంబ నుంచి సన్నిధానం వరకు ఒక వరుస క్రమంలో వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు.

మరోవైపు రద్దీ రోజుల్లో అధిక సమయం పాటు స్వామి దర్శనాన్ని భక్తులకు కల్పించడాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించింది. అయ్యప్పస్వామి సన్నిధి తంత్రిని సంప్రదించి దర్శన సమయాన్ని 30 నిమిషాలు పెంచాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్‌ను హైకోర్టు కోరింది. రద్దీ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, పోలీసులను ఆదేశించింది. గత శనివారం అయ్యప్ప దర్శనం కోసం లక్ష మంది భక్తులు బుక్ చేసుకున్నారు. అయితే 90వేల మంది భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగి పలువురు అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. రోజువారీ భక్తుల సగటు సంఖ్య 75 వేలకు పైగానే ఉంటోంది. భారీ సంఖ్యలో వస్తున్న వాహనాల క్రమబద్ధీకరణకు సైతం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories