Weather Report: రాబోయే రెండురోజుల్లో దేశంలో భారీ వర్షాలు

Heavy Rains Red Alert From Next Two Days in India
x

దేశంలో భారీ వర్షాలు (ఫైల్ ఫోటో)

Highlights

*పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ *అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ *రాజస్థాన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ లో భారీ వర్షాలకు ఛాన్స్

Weather Report: రాబోయే రెండు రోజుల్లో దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని పలు రాష్ట్రాలకు సూచనలు చేసింది. తూర్పు, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూకశ్మీరులోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ తెలిపింది. జమ్మూకశ్మీర్‌లోని కిష్టవర్ జిల్లా హోంజార్‌లో వరదలతో ఏడుగురు చనిపోయారు.

మధ్యప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాజస్థాన్‌లోని నాగౌర్, సికర్, అజ్మేర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories