Tamil Nadu: తమిళనాడు లో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Tamil Nadu: పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

Jyothi
Published on: 23 Nov 2023 12:14 PM IST
Heavy Rains in Tamil Nadu
X

Tamil Nadu: తమిళనాడు లో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా రెండు రోజులుగా రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షం కురుస్తోంది.

తమిళనాడులోని 18 జిల్లాలకు పైగా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కన్యాకుమారిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Jyothi

Jyothi

Next Story