ఒడిషాలో భారీ వర్షాలు

Odisha Rain: నీట మునిగిన కలహండి పట్టణం

Jyothi
Published on: 22 Aug 2022 11:14 AM IST
Heavy Rains In Odisha
X

ఒడిషాలో భారీ వర్షాలు

Odisha Rain: ఒడిషాలో ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు కలహండి పట్టణం మొత్తం నీట మునిగింది. ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోందని.. దీంతో అంటు రోగాలు ప్రబలుతున్నాయని వాపోతున్నారు స్థానికులు. కలహండి-రాయపూర్‌ మధ్య రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగలడంతోనే వరద నీరు పట్టణంలోకి చేరుతోందంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story