ఒరిస్సా లో భారీ వర్షాలు

Orissa Rain: మహానదికి పోటెత్తిన వరద, ముంపు ప్రాంతాల్లో అప్రమత్తం

Jyothi
Published on: 18 Aug 2022 11:10 AM IST
Heavy Rains in Orissa
X

ఒరిస్సా లో భారీ వర్షాలు

Orissa Rain: భారీవర్షాలు ఒరిస్సాను ముంచెత్తాయి. మహానదికి వరద ప్రవాహం పోటెత్తింది. గరిష్టనీటిమట్టానికి చేరుకుంది. హిరాకుడ్ ప్రాజెక్టునుంచి భారీగా వరద కొనసాగుతుండటంతో కటక్‌ జిల్లా ముండలి ఆనకట్టవద్ద మహానది ప్రవాహం క్రమేణ పెరుగుతోంది. దీంతో కఎగువప్రాంతంలో ఉన్న హిరాకుడ్ ప్రాజెుక్టును మూసివేయాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. వరద ప్రభావంతో ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఒరిసా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహాపాత్ర, ప్రత్యేక రిలీఫ్ కమిషన్ ప్రదీప్ కుమార్ జెనా, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. ముంపు ప్రభావిత ప్రాంతాలనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story