Kerala Rain: కేరళలో భారీ వర్షాలు

Kerala Rain: 4 జిల్లాలకు రెడ్‌, 11 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Jyothi
Updated on: 4 Aug 2022 9:30 AM IST
Heavy Rains in Kerala
X

Kerala Rain: కేరళలో భారీ వర్షాలు

Kerala Rain: కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. 4 జిల్లాలకు రెడ్‌, 11 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. దంచికొడుతున్న వానలతో ఇప్పటివరకు 18 మంది మృతి చెందగా ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు వేగవంతం చేశారు మరో రెండు రోజల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అదేవిధంగా తమిళనాడుకు కావేరి నది వరద పోటు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. డెల్టా ప్రాంతాలకు రెడ్ అలర్ట్‌ జారీ చేశారు. కేరళ, కర్ణాటకలో కుండపోత వర్షాలతో దిగువకు భారీగా వరద వస్తోంది. కన్యాకుమారి, తేని జిల్లాల్లోని జలపాతాలకు ఎవరూ రావొద్దని అధికారులు సూచనలు చేశారు. మధురైలోని వైగై డ్యామ్‌కు వరద ఉధృతి పెరిగింది. దిగువ గ్రామాలకు ముప్పు పొంచి ఉండటంతో కావేరి నది పరివాహక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Jyothi

Jyothi

Next Story