ఢిల్లీలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం...

Heavy Rains in Delhi Live Updates | Weather Report Today
x

ఢిల్లీలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం...

Highlights

Delhi - Heavy Rains: పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం...

Delhi - Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీనికి ఈదురు గాలులు తోడవడంతో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ, NCR పరిధిలోని డెహట్, హిండన్ AF స్టేషన్, బహదూర్‌గఢ్, ఘజియాబాద్, ఇందిరాపురం, ఛప్‌రౌలా, నోయిడా, దాద్రి, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని IMD ప్రకటించింది.

మరోవైపు ప్రయాణికులు విమానాల గురించి సమాచారాన్ని తెలుసుకోవాలని, సంబంధిత సంస్థల అధికారులతో టచ్‌లో ఉండాలని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు సూచించారు. వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తుండటంతో విమానాలు ఆలస్యంగా నడుస్తాయని జెట్ ఎయిర్ వేస్ వెల్లండిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories