ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు

* కార్లు, బైకులపై వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు

Dhatripriya
Published on: 18 March 2023 7:16 PM IST
Heavy Rains Across The Country
X

ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు 

Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో వడగండ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గురుగావ్‌లో కుండపోతగా కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. భారీ వర్షం దాటికి నగర రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మోకాలిలోతు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్లు, బైక్‌లపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాలిలోతు నీటిలో నడుచుకుంటూ పాదాచారులు అష్టకష్టాలు పడ్డారు. అటు లోతట్టు ప్రాంతాల్లోకి సైతం వరదనీరు పోటెత్తడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.

Dhatripriya

Dhatripriya

Next Story