Kerala Rain: కేరళలో భారీ వర్షాలు

Kerala Rain: 4 జిల్లాలకు రెడ్‌ అలర్ట్, 11 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు

Jyothi
Published on: 5 Aug 2022 7:55 AM IST
Heavy Rain In Kerala | Telugu News
X

Kerala Rain: కేరళలో భారీ వర్షాలు

Kerala Rain: కేరళలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. 4 జిల్లాలకు రెడ్‌ అలర్ట్, 11 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఎడతెరిపి లేని వానలతో ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. మరోవైపు NDRF సిబ్బంది సహాయక చర్యలు వేగవంతం చేశారు. అటు తమిళనాడుకు కావేరి నది వరదపోటు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. డెల్టా ప్రాంతాలకు రెడ్ అలర్ట్‌ జారీ చేశారు. కేరళ, కర్ణాటకలో కుండపోత వర్షాలతో దిగువకు భారీగా వరద వస్తోంది. కన్యాకుమారి, తేని జిల్లాల్లోని జలపాతాలకు ఎవరూ రావొద్దని అధికారులు సూచనలు చేశారు. మధురైలోని వైగై డ్యామ్‌కు వరద ఉధృతి పెరిగింది.

Jyothi

Jyothi

Next Story