ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Delhi: రూ.15.36 కోట్ల విలువ చేసే 1024 గ్రాముల కొకైన్ సీజ్

R Tripura Malini
Updated on: 18 Dec 2022 6:00 PM IST
Heavy Drug Seizure At Delhi International Airport
X

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Delhi: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకున్నారు. దాదాపు 15 కోట్ల 36 లక్షల విలువ చేసే కిలో కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. పశ్చిమ ఆఫ్రికా నుంచి వస్తున్న ప్రయాణికురాలి వద్ద కోకైన్‌ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. క్యాప్యూల్స్‌లో నింపిన కొకైన్‌న కిలాడీ లేడీ మింగేయడంతో అనుమనం వచ్చిన అధికారులు తనిఖీలు చేశారు. పొట్టలో దాచిన కొకైన్‌ను బయటకు తీసేందుకు అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. శస్త్ర చికిత్స అనంతరం పొట్టలో ఉన్న 82 క్యాప్యూల్స్‌ను వైద్యులు బయటకు తీశారు. నిందితురాలిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story