Delhi: ఢిల్లీలో దట్టంగా పొగమంచు.. విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం

Delhi: రన్‌వేపై పడిపోయిన విజిబిలిటీ

Jyothi
Published on: 15 Feb 2024 3:10 PM IST
Heavy Dense Fog In Delhi
X

Delhi: ఢిల్లీలో దట్టంగా పొగమంచు.. విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం

Delhi: దేశ వ్యాప్తంగా పలు నగరాలను పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత తెల్లవారుజామున భారీగా పడిపోయింది. ఈ కారణంగా రహదారులపై ప్రయాణాలు అత్యంత కష్టంగా మారాయి. ఉదయం ఇందిరాగాంధీ విమానాశ్రయం వద్ద కొద్ది మీటర్ల దూరంలో ఉన్న వస్తువులు కూడా కనిపించనంత దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీంతో అత్యవసరంగా టేకాఫ్‌ కావాల్సిన విమానాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. పలు జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story