Inspirational Love Story: క్యాన్సర్ అని తెలిసినా వీడని చేయి.. 11 ఏళ్లుగా ప్రాణప్రదంగా భార్యను కాపాడుకుంటూ, మురికివాడ పిల్లల పాలిట 'దైవం'గా మారిన విష్ణు!

Inspirational Love Story: ప్రేమకు మరణం లేదని నిరూపిస్తున్నారు ఈ జంట.

Arun Chilukuri
Published on: 16 Feb 2026 11:10 AM IST
Inspirational Love Story: క్యాన్సర్ అని తెలిసినా వీడని చేయి.. 11 ఏళ్లుగా ప్రాణప్రదంగా భార్యను కాపాడుకుంటూ, మురికివాడ పిల్లల పాలిట దైవంగా మారిన విష్ణు!
X

Inspirational Love Story: ప్రేమకు మరణం లేదని నిరూపిస్తున్నారు ఈ జంట. ప్రాణాంతక వ్యాధి అని తెలిసినా, తనతో నూరేళ్లూ ఉంటావో లేదో తెలియని స్థితిలోనూ.. తను ప్రేమించిన యువతి చేయి విడవకుండా పెళ్లాడి, ఆమెకు ప్రాణవాయువులా మారాడు ఆ యువకుడు.

వ్యాధి తెలిసినా వెనకడుగు వేయని విష్ణు:

కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన విష్ణు, లక్ష్మి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. పెళ్లికి ముందే లక్ష్మికి బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. స్వయంగా లక్ష్మి తను వద్దని వారించినా, విష్ణు వెనకడుగు వేయలేదు. 2014లో ఆమె మెడలో తాళి కట్టి బాధ్యత తీసుకున్నాడు. గడిచిన 11 ఏళ్లుగా సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేసి ఆమెకు చికిత్స చేయిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు.

కష్టాల్లోనూ వీడని సేవా గుణం:

వైద్యులు వీరికి పిల్లలు వద్దని సూచించినా, ఆ దంపతులు కృంగిపోలేదు. మురికివాడల్లోని పేద పిల్లలనే తమ బిడ్డలుగా భావిస్తున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. స్థానిక మురికివాడ విద్యార్థులకు ఉచితంగా చదువు చెబుతున్నారు. దాతల నుంచి సేకరించిన పుస్తకాలు, దుస్తులు, చెప్పులను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఆదివారం ఆ పిల్లలను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు.

వీరి గొప్ప మనసును గుర్తించిన చిక్‌పేట్ మాజీ ఎమ్మెల్యే ఆర్.వి.దేవరాజ్ వీరికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేసి అండగా నిలిచారు. చావుతో పోరాడుతూనే.. సమాజం కోసం బ్రతుకుతున్న ఈ జంట కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story