Arvind Kejriwal: నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ

Arvind Kejriwal: ఈడీ అరెస్ట్, రిమాండ్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్

Jyothi
Updated on: 27 March 2024 9:45 AM IST
Hearing on Kejriwal Petition in Delhi High Court today
X

Arvind Kejriwal: నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ

Arvind Kejriwal: ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్, రిమాండ్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఆభియోగాలు మోపింది. రెండేళ్ల క్రితం ఎక్సైజీ పాలసీ అమలులో భాగంగా కాంట్రాక్టర్ల వద్ద నుంచి కేజ్రీవాల్ సుమారు 100 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది.

Jyothi

Jyothi

Next Story