హత్రాస్ ఘటనపై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం

హత్రాస్ ఘటనపై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం
x
Highlights

హత్రాస్ ఘటనపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయ్. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బొబ్డే ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. బాధిత...

హత్రాస్ ఘటనపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయ్. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బొబ్డే ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. బాధిత కుటుంబానికి యూపీ ప్రభుత్వం తగిన భద్రత కల్పించిందని సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు వివరించారు. న్యాయ సహాయ విషయంలో ఇప్పటికే ప్రైవేటు న్యాయవాదులు బాధిత కుటుంబం తరపున ఉన్నారని అన్నారు. ఐతే ఈ కేసు విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలని బాధిత కుటుంబం తరపు న్యాయవాది కోరారు. స్టేటస్ రిపోర్ట్‌ను యూపీ ప్రభుత్వానికి కాకుండా సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఐతే దీనికి ఎలాంటి అభ్యంతరం లేదని యూపీ సర్కార్ తెలిపింది. ఐతే ఈ కేసులు మొత్తం విచారణను అలహాబాద్‌ హైకోర్టును చేయనివ్వాలని చీఫ్ జస్టిస్ సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories