MonkeyPox: మంకీపాక్స్‌ భయం.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Health Ministry Releases Guidelines for Management of Monkeypox
x

MonkeyPox: మంకీపాక్స్‌ భయం.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Highlights

MonkeyPox: కేర‌ళ రాష్ట్రంలో తొలి మంకీపాక్స్ కేసు వెలుగుచూడ‌డంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది.

MonkeyPox: కేర‌ళ రాష్ట్రంలో తొలి మంకీపాక్స్ కేసు వెలుగుచూడ‌డంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ వైర‌స్‌ను గుర్తించేందుకు 15 లాబొరేట‌రీల‌కు శిక్ష‌ణ‌నిచ్చిన‌ట్లు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్స్ (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. తాజాగా మంకీపాక్స్ పై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇతరులకు దూరంగా ఉండాలని ముఖ్యంగా చర్మం గాయాలు ఉన్నవారికి దూరంగా ఉండాలని కేంద్రం సూచించింది.

చనిపోయిన లేదా జీవించి ఉన్న అడవి జంతువులు, ఉడతుల, ఎలుకలు, కోతులు వంటి వాటి దూరంగా ఉండాలని అటవీ జంతువుల మాంసాన్ని దూరంగా ఉండాలని వ్యాధులతో బాధపడుతున్నవారి వస్తువులను వాడకుండా ఉండాలని సూచించింది. మంకీపాక్స్ సంబంధించి ఎలాంటి లక్షణాలు ముఖ్యంగా శరీరంపై దద్దర్లు ఉన్నవారు వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలని కేంద్రం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories