Viral Video: గజరాజుల పోరు ఎలా ఉంటుందో చూశారా.. వీడియో ఇదిగో..

* తగ్గేదేలా అంటూ రెండు ఏనుగులు ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. తొండాలతో ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ బీభత్సం చేశాయి.

Dhatripriya
Published on: 17 May 2023 6:13 PM IST
Have You Seen How The Battle Of Elephants
X

Elephants Fight: గజరాజుల పోరు ఎలా ఉంటుందో చూశారా.. వీడియో ఇదిగో.. 

Viral Video: సాధారణంగా ఏనుగులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. అయితే వాటికి కోపం వస్తే మాత్రం అంతే సంగతులు..ఏనుగుల గుంపు పంట చేలను నాశనం చేయడంతో పాటు అప్పుడప్పుడు మనుషుల పై కూడా దాడి చేస్తుంటాయి. అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో చాలా చూసే ఉంటాం కూడా. అయితే రెండు ఏనుగులు ఒకదానితో ఒకటి నువ్వా నేనా అనే రేంజ్ లో తలపడిన వీడియోని మీరు ఎప్పుడైనా చూశారా.. అలాంటి వీడియో ఒకటి నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది.

అడవిలో రెండు ఏనుగులు భీకరపోరుకు తెరలేపాయి. ఒకదానితో ఒకటి తొండాలతో తోసుకుంటూ పోరాటం చేశాయి. రెండు కొండలు ఢీ కొంటే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో గజరాజులు పోట్లాడుకున్నాయి. ఈ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. క్లాష్ అఫ్ టైటాన్స్ పేరిట... రెండు గజరాజులు పోట్లాడుకుంటే అడవి వణికిపోతుందంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. గజరాజుల పోరు చూస్తుంటే భయమేస్తోందని కొందరు కామెంట్స్ పెడితే... అసలు ఇవి దేని కోసం పోరాడుతున్నాయని మరికొందరు తమ డౌట్ ను వెల్లిబుచ్చారు. ఏనుగుల ఫైట్ ను క్యాప్చర్ చేసిన వ్యక్తి ధైర్యానికి మెచ్చుకోవచ్చంటూ మరికొందరు కామెంట్స్ పెట్టారు. బాగుండి కానీ వణుకుపుడుతోందంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.


Dhatripriya

Dhatripriya

Next Story