Haryana Election Result: రెజ్లర్ వినేష్ ఫొగాట్ విజయం

Haryana Election Result: హర్యానా అసెంబ్లీ ఎన్నికలో భారత మాజీ రెజ్లర్ వినేష్ పొగట్ విజయం సాధించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Oct 2024 1:46 PM IST
Haryana Election Result Congress Candidate wrestler Vinesh Phogat wins
X

Haryana Election Result: రెజ్లర్ వినేష్ ఫొగాట్ విజయం

Haryana Election Result: హర్యానా అసెంబ్లీ ఎన్నికలో భారత మాజీ రెజ్లర్ వినేష్ పొగట్ విజయం సాధించారు. హర్యానలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రతి రౌండ్ కు ఆధిక్యాలు మారుతుండటంతో విజయం చివరి వరకు దోబుచూలాడీంది. కాంగ్రెస్ తరపున జులానా అసెంబ్లీ నియోజకవర్గంనుంచి బరిలోకి దిగిన భారత మాజీ స్టార్ రెజ్లర్ వినేష్ పొగట్ తన సమీప బీజేపీ అభ్యర్ధి యోగేష్ కుమార్ పై విజయం సాధించింది.

అంతకు ముదు ఆమె రెండు వేల ఓట్ల వెనుకంజలో ఉన్న తరుణంలో పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అనూహ్యంగా ఆ తర్వాత రౌండ్ లో పొగట్ తిరిగి పుంజకుని విజయం సాధించింది. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్ధి యోగేష్ కుమార్, మూడో స్తానంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అబ్యర్ధి సురేందర్ లాతర్ ఉన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story