Manohar Lal Khattar: శ్రీరామా దీవించు.. బాలుడి పాదాలను తాకిన హరియాణా సీఎం

Manohar Lal Khattar: రాముడి వేషంలో ఉన్న బాలుడి పాదాలకు నమస్కరించిన సీఎం ఖట్టర్

Shekhar G
Published on: 26 Jan 2024 5:13 PM IST
Haryana Chief Minister Touches Feet Of Child Actor Dressed As Lord Ram
X

Manohar Lal Khattar: శ్రీరామా దీవించు.. బాలుడి పాదాలను తాకిన హరియాణా సీఎం

Manohar Lal Khattar: హర్యానాలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. రాముడి వేషంలో ధరించి ఉన్న ఓ బాల కళాకారుడి పాదాలను ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కర్నల్‌‌లో జెండా వందనం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కొందరు చిన్నారులు రాముడు, సీత, లక్ష్మణుడు వేషాలు వేశారు. వేదికపై ఉన్న సీఎం ఇది గమనించి వారి దగ్గరి వెళ్లారు. రాముడి వేషధారి పాదాలను తాకారు.

అనంతరం ఆ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ జగత్తులో ప్రతి చోటా ఉండే శ్రీరాముడికి నమస్కారం. గణతంత్ర వేడుకల్లో బాల కళాకారుల ప్రదర్శనకు పరవశించి భావోద్వానికి గురయ్యాను. దాన్ని కట్టడి చేసుకోలేక రాముడి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నానని ఖట్టర్ పేర్కొన్నారు.


Shekhar G

Shekhar G

Next Story