Hardik Patel: జూన్ 2న బీజేపీలోకి హార్దిక్ పటేల్

Hardik Patel: గుజరాత్‌కు చెందిన పటీదార్‌ ఉద్యమ నేత, కాంగ్రెస్‌ మాజీ నేత హార్దిక్ పటేల్ జూన్‌ 2న బీజేపీలో చేరనున్నట్లు ధ్రువీకరించారు.

Arun Chilukuri
Updated on: 31 May 2022 9:30 PM IST
Hardik Patel to join BJP on June 2
X

Hardik Patel: జూన్ 2న బీజేపీలోకి హార్దిక్ పటేల్

Hardik Patel: గుజరాత్‌కు చెందిన పటీదార్‌ ఉద్యమ నేత, కాంగ్రెస్‌ మాజీ నేత హార్దిక్ పటేల్ జూన్‌ 2న బీజేపీలో చేరనున్నట్లు ధ్రువీకరించారు. హర్దిక్‌ ఈ నెల 18న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు హార్దిక్ పార్టీని విడడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు చెప్తున్నారు. 2019లో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్ పటేల్‌..2020, జూలై 11న గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామితులయ్యారు.

ఆ తర్వాత పార్టీ అధిష్టానం, నాయకత్వం తీరుపై విరక్తిపుట్టి రాజీనామా చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఉండాల్సిన వేళ మన నాయకుడు విదేశాల్లో ఉన్నారు' అంటూ రాజీనామా సందర్భంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి సోనియాకు రాసిన లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకత్వం గుజరాత్‌ పట్ల తీవ్ర విముఖతతో ఉందని, రాష్ట్రం పట్ల వారికి ఆసక్తి లేదంటూ ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story