ఇది సర్దార్ పటేల్‌ను అవమానించడమే: హార్ధిక్ పటేల్

ఇది సర్దార్ పటేల్‌ను అవమానించడమే: హార్ధిక్ పటేల్
x

ఇది సర్దార్ పటేల్‌ను అవమానించడమే: హార్ధిక్ పటేల్

Highlights

మొతెరా క్రికెట్ స్టేడియం పేరు మార్పు చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్‌లోని ఈ స్టేడియాన్ని ఆధునికీకరించారు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు నేపథ్యంలో...

మొతెరా క్రికెట్ స్టేడియం పేరు మార్పు చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్‌లోని ఈ స్టేడియాన్ని ఆధునికీకరించారు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు నేపథ్యంలో ఈ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. మొతెరా క్రికెట్ స్టేడియాన్ని ఇప్పటివరకు సర్దార్ పటేల్ స్టేడియంగా పిలిచేవారు. అయితే ఆధునికరించిన తర్వాత దీనికి నరేంద్ర మోడీ మైదానంగా పేరు పెట్టారు. కొంత మంది దీన్ని తప్పుబడుతున్నారు. ఇది సర్దార్ పటేల్‌ను అవమానించడమేనని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ ఈ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సర్దార్ పటేల్‌పై ఈగ వాలనివ్వని బీజేపీ ఇప్పుడు సర్దార్జీని అవమానిస్తోందని హార్ధిక్ పటేల్ మండిపడ్డారు. సర్దార్ పటేల్ పేరుతో ఉన్న క్రికెట్ మైదానం పేరును నరేంద్ర మోదీ మైదానంగా మార్చడాన్ని తప్పుబట్టారు. ఇది సర్దార్ పటేల్‌కు అవమానం కాదా? సర్దార్‌జీని అగౌరవపరిచే చర్యలను గుజరాత్ ప్రజలు ఎంతమాత్రం సహించరని హార్దిక్ పటేల్ ట్వీట్ చేశారు. భారతరత్న, లోక పురుషుడు సర్దార్ పటేల్ దేశంలోని ప్రతి పౌరుడి జీవితంపై ప్రభావం చూపారు. ఆయనకు అవమానం తెచ్చే ఎలాంటి చర్యనూ హిందుస్థాన్ సహించదు అంటూ హార్దిక్ పటేల్ మరో ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories