Gujarat: గుజరాత్ కాంగ్రెస్ నుంచి కీలకమైన నేత ఔట్

Hardik Patel Resigns from Congress Party | Telugu News
x

Gujarat: గుజరాత్ కాంగ్రెస్ నుంచి కీలకమైన నేత ఔట్

Highlights

Gujarat: గుజరాత్ కాంగ్రెస్ నుంచి కీలకమైన నేత ఔట్

Gujarat: సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తరుణంలో గుజరాత్ కాంగ్రెస్ లో దుమారం చెలరేగింది. గుజరాత్ లో బలమైన వర్గం నుంచి వచ్చిన హార్దిక్ పటేల్ ఆధారంగా అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పెద్దలకు మరో భారీ నష్టం సంభవించింది. జీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న హార్దిక్ పటేల్ ఆ పార్టీకి రాజీనామా చేస్తూ బాంబు పేల్చారు.

ఇటీవల ఉదయ్‎పూర్ నవసంకల్ప్ శిబిరంలో పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పెద్దలకు తాజా వార్త అశనిపాతంలో సోకింది. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది మొదట్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యానికి గండికొట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే 2019లో హార్దిక్ పటేల్ కు పార్టీ సభ్యత్వం ఇచ్చి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. బీజేపీ విధానాలను మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న పటేల్ వర్గానికి చెందిన హార్దిక్ ను పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ హైకమాండ్.. ముఖ్యంగా రాహుల్ గాంధీ సరైన నిర్ణయమే తీసుకున్నారని అప్పట్లో చాలా మంది విశ్లేషించారు. కానీ ఇంతలోనే.. అది కూడా ఉదయ్‎పూర్ డిక్లరేషన్ జరిగిన వెంటనే హార్దిక్ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడంతో ఆ పార్టీ గుజరాత్ కు తీరని నష్టంగా భావిస్తున్నారు.

ఇక హార్దిక్ పార్టీని ఎందుకు వీడారన్నది ఆసక్తి రేపుతున్న అంశం. కాంగ్రెస్లో సంస్థాగతంగా రావాల్సిన మార్పులు రాకపోవడమే తన నిర్ణయానికి కారణంగా హార్దిక్ చెబుతున్నారు. తనకు కీలకమైన బాధ్యతలైతే ఇచ్చారు గానీ పార్టీ నిర్ణయాల్లో తన ప్రమేయం ఏమాత్రం లేదన్నది ఆయన ఆరోపణ. తనను సంప్రదించకుండానే పార్టీ నిర్ణయాలు జరిగిపోతున్నాయని, కొందరు గుజరాత్ కాంగ్రెస్ పెద్దలకు తాను పార్టీలో ఉండడం ఇష్టం లేదని, ఎప్పుడు వెళ్లిపోతానా అని ఎదురు చూస్తున్నారంటూ హైకమాండ్ ను నివ్వెరపరిచే కామెంట్లు చేశారు. హైకమాండ్ ను కలవడానికి తాను ప్రయత్నం చేసినా అవకాశం దొరకలేదని రాహుల్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తన పరిస్థితి పెళ్లికూతురును బలవంతంగా వేసెక్టమీ ఆపరేషన్ కు ఒప్పించినట్టుగా ఉందని హార్దిక్ ఇటీవలే ఓ కామెంట్ చేశారు. ఆ కామెంట్ తనలో గూడు కట్టుకున్న భావాలను వ్యక్తపరుస్తోందంటున్నారు విశ్లేషకులు. గుజరాత్ కాంగ్రెస్ నేతలకు చికెన్ శాండ్‎విచ్‎ల మీద ఉన్న శ్రద్ధ పార్టీ బాగోగుల మీద లేదని.. అలాంటి నాయకత్వాన్ని పట్టుకొని వేళ్లాడుతూ హైకమాండ్ సాధించేదేమీ లేదంటూ సోనియా-రాహుల్ నిర్ణయాల మీద డైరెక్ట్ అటాక్ చేశారు హార్దిక్.

గుజరాత్ లోని పటేల్ వర్గానికి రిజర్వేషన్ కావాలన్న డిమాండ్ తో తెరమీదికొచ్చిన హార్దిక్ పార్టీలో తాను ఎదుర్కొంటున్న ఉక్కపోతతో బీజేపీ వైపు మళ్లినట్టు తెలుస్తోంది. చిన్నవయసులోనే దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన పటేల్ వర్గ ప్రతినిధిని కాంగ్రెస్ సరిగా ఉపయోగించుకోలేకపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదునుగా కొద్దికాలం నుంచి హార్దిక్ తో పలువురు బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. దీంతో ఆయన అసంతృప్తికి ఆజ్యం పోసినట్టయింది. ఫలితంగా తాజా నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ.. తన రాజీనామా లేఖను రాహుల్ గాంధీకి పంపించారు. వందేళ్ల పైబడ్డ కాంగ్రెస్ పార్టీలో విధానపరమైన ఆలోచనే లేదనేది హార్దిక్ మరో విమర్శ. బీజేపీ నేతల నిర్ణయాలను, విధానాలను గుడ్డిగా విమర్శించడమే తప్ప.. విధానపరమైన అటాక్ లేదనేది హార్దిక్ అభియోగం. ఇలాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ ని, అది కూడా గుజరాత్ నుంచి ఎదుగుతున్న మొక్కను బీజేపీ నేతలు ఎందుకు వదులుకుంటారు? కచ్చితంగా ఆయనలోని శక్తి-సామర్థ్యాలను బీజేపీ నేతలు వాడుకొని తీరుతారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి పార్టీకి ఓవరాలింగ్ చేసి పరుగులు పెట్టించాలనుకుంటున్న తరుణంలో గుజరాత్ నుంచి ఓ యువ నాయకుణ్ని కోల్పోవడం కాంగ్రెస్ కు పెద్ద నష్టమేనంటున్నారు విశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories