Hardik Patel: బీజేపీలో చేరిన తరువాత హార్దిక్ ఫస్ట్ స్టేట్‎మెంట్

Hardik Patel: గుజరాత్ గాంధీనగర్‎లో బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్

Rama Rao
Published on: 2 Jun 2022 4:55 PM IST
Hardik Patel Join in BJP In Gujarat | National News
X

Hardik Patel: బీజేపీలో చేరిన తరువాత హార్దిక్ ఫస్ట్ స్టేట్‎మెంట్

Hardik Patel: గుజరాత్ యువనేత, పటీదార్ కోటా పోరాటంతో ముందుకొచ్చిన హార్దిక్ పటేల్ బీజేపీలో చేరిపోయారు. గాంధీనగర్లోని పార్టీ ఆఫీసులో ఆ రాష్ట్ర ముఖ్యనేతల సమక్షంలో హార్దిక్ పటేల్ కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరడానికి కొన్ని గంటల ముందు.. ఇక నుంచి తన జీవితంలో ఒక ముఖ్య అధ్యాయం ప్రారంభమవుతుందని ట్వీట్ చేశారు. ప్రధాని మోడీకి మంచి విజన్ ఉందని, ఆయన సారథ్యంలో ఓ చిన్న సోల్జర్ గా పని చేస్తానని చెప్పారు.

మోడీ సారథ్యంలో దేశం ప్రగతిపథంలో పయనిస్తోందని, అదే ప్రచారాన్ని తాను కొనసాగిస్తానంటున్నారు. కాంగ్రెస్ లోని ఇతర నేతలను కూడా హార్దిక్ బీజేపీలోకి తీసుకొస్తాడని రాష్ట్ర నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2019లోనే కాంగ్రెస్ లో చేరిన హార్దిక్ పటేల్ కు కాంగ్రెస్ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కట్టబెట్టింది. అయితే స్థానిక సీనియర్లు తన రాకను జీర్ణించుకోలేకపోతున్నారని, పొమ్మంటూ పొగ పెడుతున్నారని ఈ మధ్యనే పటేల్ విరుచుకుపడ్డారు. అటు కాంగ్రెస్ హైకమాండ్ అచేతనావస్థనూ తీవ్రంగా దుయ్యబట్టారు.

Rama Rao

Rama Rao

Next Story