ఎంపీ న‌వ‌నీత్ కౌర్ దంప‌తుల అరెస్ట్‌.. ముంబైలో హైటెన్ష‌న్‌..

Hanuman Chalisa Row Navneet Rana and his Husband Arrested
x

ఎంపీ న‌వ‌నీత్ కౌర్ దంప‌తుల అరెస్ట్‌.. ముంబైలో హైటెన్ష‌న్‌..

Highlights

Navneet Rana: హ‌నుమాన్ చాలీసా వివాదంతో మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో హైటెన్షన్ నెలకొంది.

Navneet Rana: హ‌నుమాన్ చాలీసా వివాదంతో మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో హైటెన్షన్ నెలకొంది. హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాల‌ని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలు ప్రక‌టించారు. ఈ నేపథ్యంలో న‌వ‌నీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివ‌సేన శ్రేణులు ప్రయత్నించారు. హైడ్రామా మధ్య ఎంపీ న‌వ‌నీత్ కౌర్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇద్దరినీ ఖార్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. పోలీసుల చ‌ర్యపై న‌వ‌నీత్ కౌర్ దంప‌తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ ఉగ్రవాద చ‌ర్యల‌కు పాల్పడ‌టం లేద‌ని, సీఎం ఇంటి ముందు హ‌నుమాన్ చాలీసా ప‌ఠిస్తామ‌ని మాత్రమే చెబుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉద్ధవ్ నేతృత్వంలో గూండారాజ్యం నడుస్తోందని నవనీత్ కౌర్ మండిపడ్డారు. నవనీత్ వెనుక బీజేపీ కుట్ర రాజకీయాలు ఉన్నాయని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories