పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఎగిరిపడ్డ బోగీలు..

Guwahati-Bikaner Express Derails: పశ్చిమ బెంగాల్‌లోని మైనపూరిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 13 Jan 2022 7:26 PM IST
Guwahati-Bikaner Express Derailed Near Domohani West Bengal
X

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఎగిరిపడ్డ బోగీలు..

Guwahati-Bikaner Express Derails: పశ్చిమ బెంగాల్‌లోని మైనపూరిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బికనీర్‌ గౌహతి ఎక్స్‌ప్రెస్‌ పాట్నా నుంచి గౌహతి వెళ్తుండగా జల్పాయిగురి వద్ద సడన్‌గా పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పడంతో ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. మరికొంతమంది ప్రయాణికులు బోగీల్లోనే చిక్కుకున్నారు. వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారు. బెంగాల్‌ సీఎం మమత బెనర్జీకి ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story