Actor Govinda: బాలీవుడ్ హీరో గోవిందా ఇంట్లో పేలిన గన్..గోవిందాకు గాయాలు

Actor Govinda hospitalized : బాలీవుడ్ హీరో, శివసేన నాయకుడు గోవిందా ఇంట్లో గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ప్రమాదంలో గోవిందాకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఆయనను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

Gun misfire at Bollywood hero Govindas house, Govinda injured and shifted to hospital
X

Actor Govinda: బాలీవుడ్ హీరో గోవిందా ఇంట్లో పేలిన గన్..గోవిందాకు గాయాలు

Actor Govinda hospitalized : బాలీవుడ్ నటుడు, శివసేన అధినేత గోవిందా ఇంట్లో గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ప్రమాదంలో గోవిందాకు గాయాలైనట్లు సమాచారం. తన సొంత తుపాకీతో కాలికి కాల్చుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4.45 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఉదయం ఇంట్లోనుంచి బయటకు వెళ్తున్న సమయంలో గన్ మిస్ ఫైర్ అయినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. దీంతో వెంటనే ఆయన్ను సమీపంలో కృతి కేర్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ విషయంపై పోలీసులు ఇప్పుడు విచారణ ప్రారంభించారు. గోవింద తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం గోవింద కాలు నుంచి రక్తం ఎక్కువగా కారిందని, దీంతో అతడి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. అతని పరిస్థితి క్షీణించడంతో, అతను ప్రస్తుతం అంధేరిలోని కృతి కేర్ ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు.

గోవింద కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించాడు. 'కూలీ నంబర్ 1', 'హసీనా మాన్ జాయేగీ', 'స్వర్గ్', 'సాజన్ చలే ససురల్', 'రాజా బాబు', 'రాజాజీ', 'పార్టనర్' వంటి మెగా హిట్ చిత్రాలతో గోవిందా తన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కామెడీ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించడంలో గోవిందాకు బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గోవిందా చివరిగా 2019లో 'రంగీలా రాజా' చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం తెరపై పెద్దగా విజయం సాధించలేదు. అయితే ఈ మధ్యకాలంలో టీవీ రియాల్టీ డ్యాన్స్ షోలలో ఎక్కువగా యాక్ట్ చేస్తున్నాడు.

గోవిందా లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పార్టీ శివసేనలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. గోవిందకు సునీతతో వివాహం అయ్యింది. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు సినిమాల్లోకి అడుగుపెట్టగా, కొడుకు త్వరలో తెరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నాడు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story