మోడీ స్టేడియం పేరును మారుస్తాం.. మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ..!

Manifesto: గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అహ్మదాబాద్‌లోని ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియం పేరును మారుస్తానని ఆ పార్టీ హామీ ఇచ్చింది.

Arun Chilukuri
Updated on: 12 Nov 2022 9:30 PM IST
Gujarat Manifesto Congress Promises To Rename Narendra Modi Stadium
X

మోడీ స్టేడియం పేరును మారుస్తాం.. మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ..!

Manifesto: గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అహ్మదాబాద్‌లోని ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియం పేరును మారుస్తానని ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. సుమారు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రకటించారు. మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పారు. మోడీ స్టేడియం పేరును సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ స్టేడియంగా మారుస్తామనీ వెల్లడించారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వన్ని ఏర్పాటు చేస్తే.. తొలి క్యాబినెట్ సమావేశంలోనే తమ మ్యానిఫెస్టోను అధికారికంగా అమలు చేస్తామన్నారు.

మహిళలు, వితంతువులు, వృద్ధులకు నెల 2వేల చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పుకొచ్చారు. 3 వేల వరకు ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను ప్రారంభిస్తామన్నారు. బాలికలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందిస్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. 3 లక్షల వరకు వ్యవసాయ రుణా మాఫీ చేస్తామన్నారు. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువకులకు 3 వేల చొప్పున జీవన భృతి, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పొకొచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story