Exit Poll Results: గుజరాత్ బీజేపీదే.. హిమాచల్‌లో కాంగ్రెస్, కమలం హోరాహోరీ

Gujarat, Himachal Pradesh Exit Poll Results

Arun Chilukuri
Updated on: 5 Dec 2022 7:33 PM IST
Gujarat, Himachal Pradesh Exit Poll Results
X

Exit Poll Results: గుజరాత్ బీజేపీదే.. హిమాచల్‌లో కాంగ్రెస్, కమలం హోరాహోరీ

Exit Polls: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీదే పైచేయి అని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. గుజరాత్‌లో గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామన్న బీజేపీ అంచనాలు నిజమయ్యే విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉన్నాయి. 182 శాసనసభ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్‌ 1న, డిసెంబర్‌ 5న రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయాయి. ఈనేపథ్యంలో సోమవారం సాయత్రం విడుదలైన పలు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు గుజరాత్‌లో బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. తర్వాతి స్థానంలో కాంగ్రెస్‌ ఉంది. ఆప్‌ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

గుజరాత్- 182 స్థానాలు

ఆత్మసాక్షి: బీజేపీ 98-110, కాంగ్రెస్ 66-71, ఆప్ 9-14

పీపుల్స్ ఫల్స్: బీజేపీ 125-143, కాంగ్రెస్ 30-48, ఆప్ 3-7

న్యూస్ ఎక్స్-జన్ కీ బాత్: బీజేపీ 117-140, కాంగ్రెస్ 35-51, ఆప్ 6-13

రిపబ్లిక్ టీవీ: బీజేపీ 128-148, కాంగ్రెస్ 40-50, ఆప్ 3-5

హిమాచల్ ప్రదేశ్ – 68 స్థానాలు

ఆత్మసాక్షి: బీజేపీ 31-35, కాంగ్రెస్ 33-36, ఆప్ 2-3

పీపుల్స్ ఫల్స్: బీజేపీ 27-37, కాంగ్రెస్ 29-39, ఆప్ 0

న్యూస్ ఎక్స్-జన్ కీ బాత్: బీజేపీ 32-40, కాంగ్రెస్ 27-34, ఆప్ 0

రిపబ్లిక్ టీవీ: బీజేపీ 34-39, కాంగ్రెస్ 28-33, ఆప్ 0-1

Arun Chilukuri

Arun Chilukuri

Next Story