గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీకి క‌రోనా పాజిటివ్‌

Arun Chilukuri
Published on: 15 Feb 2021 2:47 PM IST
గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీకి క‌రోనా పాజిటివ్‌
X

గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీకి క‌రోనా పాజిటివ్‌

గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కొవిడ్ బారిన పడ్డారు. నిన్న వడోదర ఎన్నికల ప్రచారంలో కుప్పకూలిన ఆయన్ను హాస్పిటల్‌కు తరలించగా ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణైంది. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోన్న విజయ్ రూపాణి వడోదర మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగిస్తూ అక్కడే కుప్పకూలారు. దాంతో ఆయన్ను యూఎన్ మెహతా హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన అధికారులు, నేత‌లు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని విజ‌య్ రూపానీ కోరారు. వారంపాటు హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story