క్వారంటైన్ కు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ

క్వారంటైన్ కు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ
x
Gujarat CM Vijay Rupani
Highlights

గుజరాత్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ అని తేలడం.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ముందస్తు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

గుజరాత్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనావైరస్ పాజిటివ్‌ అని తేలడం.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ముందస్తు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.ఇటీవల ఆ ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో భేటీ అయిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం కోవిడ్ -19 పరీక్ష చేయించుకున్న రూపానీ తనకు తాను నిర్బంధించుకున్నారు. దీంతో ఇంటి నుండే అన్ని ప్రభుత్వ కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పాలన సాగిస్తారని అధికారులు తెలిపారు.

అహ్మ‌దాబాద్‌లోని జ‌మ‌ల్‌పూర్ ఖాదియా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేద్వాలాకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఓం ప్రకాష్ మచ్రా ధృవీకరించారు.

అయితే అంతకుముందు మంగళవారం మధ్యాహ్నం ఇమ్రాన్‌.. గాంధీ నగర్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంతో పాటు మరికొందరిని కూడా కలిశారు. వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారు ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా బుధవారం నాటికి గుజరాత్‌లో మొత్తం 617 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. అలాగే మృతుల సంఖ్య 26కు చేరింది.


Show Full Article
Print Article
Next Story
More Stories