Gujarat New CM: కాసేపట్లో గుజరాత్ కొత్త సీఎం పేరు ప్రకటన

Gujarat New CM: *గాంధీనగర్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం *కొత్త సీఎం ఎంపికపై శాసనసభాపక్ష భేటీలో చర్చ

Shireesha
Published on: 12 Sept 2021 2:58 PM IST
Gujarat New CM Announcement Today | BJP | National News
X

కాసేపట్లో గుజరాత్ కొత్త సీఎం పేరు ప్రకటన

Gujarat New CM: గుజరాత్ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ కీలక భేటీ అనంతరం గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించనుండగా.. కేంద్ర పరిశీలకులుగా ప్నహ్లాద్ జోషి, నరేంద్రసింగ్ తోమర్‌లో శాసనసభాపక్ష సమావేశానికి హాజరయ్యారు.

మరోవైపు.. గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేరు బలంగా వినిపిస్తోంది. మన్‌సుఖ్ మాండవీయతో పాటు సీఆర్ పటేల్, నితిన్ పటేల్, గోర్థన్ ఝుడాఫియా పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మన్‌సుఖ్ మాండవీయ పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ.. పటేల్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కిన బీజేపీ ఈసారి బలమైన సామాజిక వర్గం పటేళ్లను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story