Odisha: ఒడిశాలో మరో రైలు ప్రమాదం

Odisha బాలాసోర్ జిల్లా రూప్సా రైల్వే స్టేషన్‌ గూడ్స్ రైలు కంపార్ట్‌మెంట్‌లో మంటలు

Dhatripriya
Published on: 10 Jun 2023 12:55 PM IST
Goods Train Catches Fire In Balasore
X

Odisha: ఒడిశాలో మరో రైలు ప్రమాదం 

Odisha: ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. బాలాసోర్ జిల్లాలోని రూప్సా రైల్వే స్టేషన్‌ గూడ్స్ రైలు కంపార్ట్‌మెంట్‌లో... ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. చర్యలు తీసుకోవడంతో రైల్వే స్టేషన్‌లో ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించారు. పశ్చిమ బెంగాల్ నుండి బాలాసోర్‌కు బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలు... రూప్సా జంక్షన్‌లో ఆపి ఉండగా... రైలు కంపార్ట్‌మెంట్ నుండి పొగలు రావడాన్ని స్టేషన్ సిబ్బంది గమనించారు. మంటలు వ్యాపించకుండా స్టేషన్ అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ప్రమాదం తప్పింది.

Dhatripriya

Dhatripriya

Next Story