Gone Prakash Rao: తెలంగాణ‌ భవన్ రూమ్‌లు పశువుల కొట్టం కంటే దారుణంగా ఉన్నాయి

Gone Prakash Rao: జూన్ 30లోపు చర్యలు తీసుకోక పోతే.. నేనే తెలంగాణ భవన్ బాత్ రూమ్‌లు క్లిన్ చేయిస్తా

Dhatripriya
Updated on: 8 May 2023 2:01 PM IST
Gone Prakash Rao About TS Bhavan
X

Gone Prakash Rao: తెలంగాణ‌ భవన్ రూమ్‌లు పశువుల కొట్టం కంటే దారుణంగా ఉన్నాయి

Gone Prakash Rao: ఢిల్లీ తెలంగాణ భవన్‌లో సౌకర్యాలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు ఫైర్ అయ్యారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో సరైన వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశఆరు. తెలంగాణ‌ భవన్ రూమ్‌లు పశువుల కొట్టం కంటే దారుణంగా ఉన్నాయన్నారు. తెలంగాణ భవన్ రూముల కంటే ఢిల్లీలోని సులబ్ కాంప్లెక్స్‌లు శుభ్రంగా ఉన్నాయని తెలిపారు. ఇద్దరికి రోజుకు 6 వేలు వసూలు చేస్తున్నారని అయినా సౌకర్యాలు సరిగ్గా లేవని... గోనె ప్రకాశ్‌రావు మండిపడ్డారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో లిఫ్ట్ పనిచేయకపోయినా... పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. జూన్ 30లోపు చర్యలు తీసుకోక పోతే... తానే తెలంగాణ భవన్ బాత్ రూమ్‌లు క్లిన్ చేయిస్తానని గోనె ప్రకాశ్ రావు అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story