Kumbha Mela 2025: ప్రయాగ్ రాజ్‎లో సెంటరాఫ్ అట్రాక్షన్‎గా గోల్డెన్ బాబా..6 కిలోల నగలతో సందడి

Kumbha Mela 2025: ప్రయాగ్ రాజ్‎లో సెంటరాఫ్ అట్రాక్షన్‎గా గోల్డెన్ బాబా..6 కిలోల నగలతో సందడి
x
Highlights

Kumbha Mela 2025: యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో వెరైటీ సాదువులు, సన్యాసులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. 6కిలోల బంగారు...

Kumbha Mela 2025: యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో వెరైటీ సాదువులు, సన్యాసులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. 6కిలోల బంగారు ఆభరణాలను ధరించి గోల్డెన్ బాబా మహా మండలేశ్వర్ నారాయణానంద్ గిరి మహరాజ్ సందడి చేస్తున్నారు. కేరళకు చెందిన ఈ బాబా నిరంజనీ అఖాండాకు చెందినవారు. ఈ ఆభరణాలన్నీ పలు దేవతలకు గుర్తుగా ధరించినవని తెలుస్తోంది. రుద్రాక్షలు, పగడాలు, రూబీలు, నీలమణులు, పచ్చలు పొదిగిన వీటి నుంచి తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. గత 15ఏళ్లుగా ధరిస్తున్నానని..శ్రీ యంత్రం చిహ్నం కూడా ఉంటుందని తెలిపారు. పూజల్లోనూ ఇవన్నీవినియోగిస్తుంటారు. కేరళలో సనాతన ధర్మ ఫౌండేషన్ కు చైర్మన్ గా సేవలు అందిస్తున్నట్లు ఈ బాబా తెలిపారు.




ఇక తాను ఎక్కడికి వెళ్లినా జనం తనపై విశ్వాసం చూపిస్తున్నారని..భక్తులు తనను గోల్డెన్ బాబా అని పిలుస్తారని తెలిపారు. దీనికి తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. తన 6 బంగారు లాకెట్లు ఉన్నాయని వాటితో దాదాపు 20 దండలు తయారు చేయవచ్చని చెప్పారు. అంతేకాదు మొబైల్ పౌచ్ కూడా బంగారు పొరతో తయారు చేసిందే. ఇక బాబా చేసే పనులన్నీ సాధనకు సంబంధించినవే. ఆధ్యాత్మిక జీవితానికి, తన గురువు పట్ల భక్తికి చిహ్నంగానే ఆభరణాలు ధరించినట్లు చెప్పారు. కుంభమేళాలో ఈ గోల్డెన్ బాబా ఆధ్యాత్మికత , భక్తి సందేశాన్ని ఇస్తున్నారు.




జూనా అఖాడాకు చెందిన ఆశ్రమం నుంచి వెళ్లిపోయారంటూ తనపై వచ్చిన వార్తలను ఐఐటీ బాబా అభయ్ సింగ్ ఖండించారు. హర్యాణాకు చెందిన ఈ బాబా మానసిక స్థితి సరిగ్గా లేదని..డ్రగ్స్ తీసుకొంటున్నారని ఆశ్రమ వర్గాలు ఆరోపించాయి. ఈ విషయం అందరికీ తెలియడంతో అభయ్ సింగ్ ఆశ్రమం విడిచివెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే తను ఫేమస్ కావడాన్ని వారు జీర్ణించుకోలేకే రాత్రికి రాత్రి ఆశ్రమం నుంచి వెళ్లిపొమ్మన్నారు. నా మానసిక స్థితి సరిగ్గా లేదనా ధ్రువపత్రం ఇవ్వడానికి వారెవరూ అంటూ ఐఐటీ బాబా ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories