నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

*బోర్డు ఛైర్మన్ ఎంకే సిన్హా నేతృత్వంలో జలసౌధలో మీటింగ్

Jyothi
Updated on: 3 Jan 2023 11:59 AM IST
Godavari River Management Board Meeting Today
X

నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

Jalasoudha: జలసౌధలో నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. బోర్డు ఛైర్మన్ ఎంకే సిన్హా నేతృత్వంలో జరగనున్న ఈ మీటింగ్‌కు ఏపీ, తెలంగాణ అధికారులు, ఇంజనీర్లు హాజరుకానున్నారు. బోర్డు నిర్వహణ వ్యయం, సీడ్ మనీ, అదనపు పోస్టులు, ప్రత్యేక వసతులపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణకు చెందిన గూడెం, మొడికుంటవాగు ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు జీఆర్ఎంబీ ముందుకు రానున్నాయి. ఇక టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుతో పాటు పెద్దవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై చర్చించనున్నారు. 8 నెలల తర్వాత జరగనున్న భేటీ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.


Jyothi

Jyothi

Next Story