మరో ముఖ్యమంత్రికి క‌రోనా పాజిటివ్

మరో ముఖ్యమంత్రికి క‌రోనా పాజిటివ్
x
Highlights

Corona Updates: కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌ దేశాల్లో క‌ల్లోలం సృష్టిస్తుంది. సామ్యానుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు గుండెల్లో...

Corona Updates: కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌ దేశాల్లో క‌ల్లోలం సృష్టిస్తుంది. సామ్యానుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఇటు మ‌న దేశంలోనూ కరోనా ఉధృతి శరవేగంగా ఉంది. ఈ వైరస్‌కు చిక్కకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యపడటం లేదు. అత్యంత సురక్షితంగా ఉండే రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు సైతం ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో కరోనా పేరు చెబితే హడలిపోతున్నారు.

తాజాగా గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ కూడా క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింద‌ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే తనకు క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉంటున్న‌ట్లు గోవా ముఖ్యమంత్రి తెలిపారు. ఇంటి నుంచే త‌న కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తాన‌ని వెల్లడించారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సీఎం సావంత్ విజ్ఞ‌ప్తి చేశారు. అంతేకాకుండా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమోద్ సావంత్ కరోనా బారినపడిన నాలుగో సీఎం. ఇంతకు ముందు ముగ్గురు ముఖ్యమంత్రులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు కరోనా సోకింది. వీరిలో ఇప్పటికే యడియూరప్ప, శివరాజ్ సింగ్ పూర్తిగా కోలుకున్నారు. కరోనా బారినపడిన నలుగురు సీఎంలు బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం.Show Full Article
Print Article
Next Story
More Stories