Goa: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. మాజీ సీఎం సహా బీజేపీలో చేరనున్న 8 మంది ఎమ్మెల్యేలు

Goa: గోవాలో హస్తం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది.

Arun Chilukuri
Published on: 14 Sept 2022 12:48 PM IST
Goa 8 Congress MLAs to join BJP
X

Goa: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. మాజీ సీఎం సహా బీజేపీలో చేరనున్న 8 మంది ఎమ్మెల్యేలు

Goa: గోవాలో హస్తం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలు గుడ్‌ బై చెప్పారు. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారు. వారంతా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌, అసెంబ్లీ స్పీకర్‌ను కలిశారు. ఈ మేరకు పార్టీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్‌ షెట్ తెలిపారు. వారిలో మాజీ సీఎం దిగంబర్‌ కామత్‌, మిచెల్‌ లోబో, డెలిలాహ్‌ లోబో, రాజేశ్‌ ఫల్‌దేశాయ్‌, కేదార్‌ నాయక్‌, సంకల్ప్‌ అమోన్కర్‌, అలెక్సియో సెక్వీరియ, ఉడాల్ఫ్‌ ఫెర్నాండేస్‌ ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story