విమానం కిందకు దూసుకెళ్లిన కారు.. అసలేం జరిగిందంటే...

Go First Car Passes Under IndiGo Plane
x

విమానం కిందకు దూసుకెళ్లిన కారు.. అసలేం జరిగిందంటే...

Highlights

IndiGo Plane: ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్ర‌యంలో అనూహ్య ఘటన జరిగింది.

IndiGo Plane: ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్ర‌యంలో అనూహ్య ఘటన జరిగింది. ఎయిర్​పోర్ట్​లో ట‌ర్మిన‌ల్ 2 వ‌ద్ద నిలిపి ఉంచిన ఇండిగో విమానం కిందకు కారు దూసుకెళ్లింది. గోఫస్ట్ ఎయిర్​లైన్​కు చెందిన ఓ కారు.. ఇండిగో ఏ320నియో విమానం కిందకు వెళ్లింది. విమానం ముందు చక్రాల ముందు ఆగింది. త్రుటిలో విమానాన్ని ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

విమానం మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి పట్నాకు బయల్దేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే స్విఫ్ట్ డిజైర్ కారు దూసుకొచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వివరించారు. ఇటీవ‌ల ఇండిగో విమానాల‌కు స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్న విష‌యం తెలిసిందే. అస్సాంలో ఇండిగో విమానం ఒక‌టి ర‌న్‌వే మీదు నుంచి స్కిడ్ అయింది. బాంబు తీసుకువెళ్తున్న‌ట్లు ఓ ప్ర‌యాణికుడు బెదిరించ‌డంతో పాట్నా ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద కూడా ఇండిగో విమానాన్ని ఆపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories