Ghulam Nabi Azad: కొత్త పార్టీ ఏర్పాటుపై ఆజాద్‌ కీలక ప్రకటన

Ghulam Nabi Azad: 10 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తాం

Rama Rao
Published on: 11 Sept 2022 4:59 PM IST
Ghulam Nabi Azad to announce new party in 10 days
X

Ghulam Nabi Azad: కొత్త పార్టీ ఏర్పాటుపై ఆజాద్‌ కీలక ప్రకటన

Ghulam Nabi Azad: తన రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన జమ్మూకశ్మీర్ నేత గులాంనబీ ఆజాద్‌.. కొత్త పార్టీపై కీలక ప్రకటన చేశారు. పది రోజుల్లో తన కొత్తపార్టీ పేరు ప్రకటిస్తానన్నారు. జమ్మూ కశ్మీర్ లోని బారాముల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆజాద్ కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు మద్దతిచ్చేవారు ఎన్నో రెట్లు పెరిగారన్న ఆజాత్.. జమ్మూలో 30-35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400 మందిని కలిసినట్లు తెలిపారు. ఏ పార్టీ అయినా తనతో నడుస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు. మరిన్ని విషయాలపై చర్చించినత తర్వాత మరో 10 రోజుల్లో తన కొత్తపార్టీని ప్రకటిస్తానని చెప్పారు ఆజాద్.

Rama Rao

Rama Rao

Next Story