Gaza Attack: గాజా, ఇజ్రాయిల్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు

Gaza Attack: గాజాపై ఇజ్రాయిల్‌ దాడిలో కుప్పకూలిన 13 అంతస్తుల భవనం

Samba Siva Rao
Published on: 12 May 2021 6:54 PM IST
Gaza attack 43 killed in Gaza in Israel strikes
X

గాజా ఎటాక్ (ఫైల్ ఇమేజ్)

Gaza attack: గాజాలోని హమాస్‌ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్‌ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పరస్పర రాకెట్‌ దాడులతో పలు భవనాలు కుప్పకూలిపోయాయి. ఇజ్రాయిల్‌ దాడిలో గాజాలోని 13 అంతస్తుల హందాయి టవర్‌ కుప్పకూలిన దృశ్యాలను ఇజ్రాయెల్‌ రక్షణ దళం తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

ఈ భవనంలోనే హమాస్‌ ఉగ్రవాద నాయకుల గృహాలతోపాటు కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇక ఆ ప్రాంతంలో దాడులు జరుగుతాయని ముందుగానే భావించిన స్థానిక అధికారులు దాడికి ముందు ప్రజలన ఖాళీ చేయాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు దాడులకు పాల్పడకూడదని, ఇరు పక్షాలు సంయమనం పాటించాలని పలు దేశాలు కోరుతున్నాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story