Punjab: పంజాబ్‌లోని లూధియానాలో గ్యాస్ లీకేజీ కలకలం
* అస్వస్థతకు గురైన కార్మికులు ఆస్పత్రికి తరలింపు
పంజాబ్‌లోని లూధియానాలో గ్యాస్ లీకేజీ కలకలం
Punjab Gas Leak: పంజాబ్‌లోని లూధియానాలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టించింది. ఆక్సీజన్ తయారీ కేంద్రం అర్పిత గ్యాస్‌లో సీవో2 గ్యాస్ లీకయ్యింది. భయాందోళనతో కార్మికులు పరుగులు తీశారు. గ్యాస్ లీక్‌తో అస్వస్థతకు గురైన పలువురు కార్మికులను ఆస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఫ్యాక్టరీ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల వరకు రోడ్లను మూసివేశారు. ఫ్యాక్టరీ పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్యాస్ లీక్ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు కారణాలను తెలుసుకుంటున్నారు.
Next Story




