Rajasthan: కోర్టు ఆవరణలో దారుణ హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్

Rajasthan: గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు

Rama Rao
Updated on: 19 Sept 2022 9:30 PM IST
Gangster shot dead in broad daylight in Nagaur | Telugu News
X

Rajasthan: కోర్టు ఆవరణలో దారుణ హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ 

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. నాగర్ జిల్లా కోర్టు సాక్షిగా ఓ గ్యాంగ్ స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న గ్యాంగ్ స్టర్‌ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు..తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో గ్యాంగ్‌స్టర్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఈ కాల్పుల ఘటనలో కోర్టు ఆవరణలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కోర్టు ఆవరణలో తుపాకీ కాల్పులు ఒక్కసారిగా కలకలం రేపాయి. అయితే గ్యాంగ్‌స్టర్‌ను దారుణంగా చంపిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నామని నాగర్ ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story