Gandhi Jayanti: మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

Gandhi Jayanti: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ నివాళులర్పించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Oct 2024 12:00 PM IST
Gandhi Jayanti
X

Gandhi Jayanti: మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

Gandhi Jayanti: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ నివాళులర్పించారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని గాంధీ స్మారకం రాజ్‌ఘాట్‌ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించారు. అంతకుముందు ఎక్స్‌ వేదికగా ప్రధాని ఆయనకు నివాళులర్పించారు. సత్యం, సామరస్యం, సమానత్వం అనే సిద్ధాంతాలతోనే బాపూజీ జీవితం గడిచింది. ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని గాంధీజీని గుర్తుచేసుకున్నారు.

ఆయనతో పాటు పలువురు ప్రముఖులు రాజ్‌ఘాట్‌ వద్ద జాతిపితకు నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ తదితరులు మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story